
304views
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలపూజ వైభవంగా ముగిసింది. చివరి రోజు వేల మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. 41 రోజుల పాటు సాగిన వార్షిక మండల సీజన్లో మొత్తం 32.5 లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సన్నిధానా నికి చేరుకున్న ఆభరణాల పెట్టెలోని ఆభరణాలను అయ్యప్పకు అలంకరించి మండల పూజ నిర్వహించారు. అనంతరం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. సంక్రాంతి పండగ వరకు సాగే మకరవిలక్కు సీజన్ కోసం ఈ నెల 30న సాయంత్రం అయిదు గంటలకు ఆలయాన్ని తెరుస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.





