News

కుంభాభిషేక విశిష్టతను తెలుసుకోవాలి

252views

కుంభాభిషేక విశిష్టతను ప్రతి ఒక్క రూ తెలుసుకోవాలి.. శివుని ఆజ్ఞ లేనిదే చీ మైనా కుట్టదనే పరమార్థాన్ని తెలుసుకోవాలి.. అప్పుడే మానసిక వికాసంతో ఆధ్యాత్మిక భావన పెంపొందుతుందని సనాతన ధర్మోపన్యాసకులు, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు.బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని దేశాయిపేట నీలకంఠపురంలోని శ్రీ గంగా పీయూషాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి క్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా బ్రహ్మశ్రీ చాగంటి హాజరై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలను వినిపించారు. మృధు, శాంత, గంభీర స్వరంతో ఆయన గొంతుక నుంచి జాలువారిన ప్రవచనాలు ఆధ్మాత్మిక గుభాళింపులు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. ప్రతి ఒక్కరూ శివ నామస్మరణలో ఓలలాడారు. కుంభాభిషేకం విశిష్టతను వివరిస్తూ, శివతత్వాన్ని ఆయన బోధించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా నిర్వాహకులు ఏర్పా ట్లు చేశారు.

శ్రీ హనుమత్‌ వైభవం
చీరాల ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో శ్రీ హనుమత్‌ వైభవం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి సనాతన ధర్మోపన్యాసకు లు చాగంటి కోటేశ్వరరా ప్రచనాల కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. హనుమంతుని ఉపాసనతో ఒనగూరే ప్రయోజనాలను వివరించారు.రామాయణంలో హనుమంతుని పాత్రను సవివరంగా చెప్పారు. అప్పటి దృశ్యాలు కళ్ల ముందు మెదులుతున్నాయా అన్న రీతిలో చాగంటి ప్రవచనాలు సాగాయి.