News

15 రోజుల్లో సంభల్ మసీదు సర్వే నివేదిక

300views

ఉత్తర్ ప్రదేశ్లోని సంభల్ లో ఉన్న షాహీ జామా మసీదుకు సంబంధించిన సర్వే నివేదికను 15 రోజుల్లో దాఖలు చేయనున్నట్లు కోర్టు కమిషనర్ రమేశ్ సింగ్ రాఘవ్ తెలిపారు. అనారోగ్యం కారణంగా నివేదిక సమర్పణకు కొంత సమయం కావాలని ఆయన స్థానిక సివిల్ కోర్టు (సీనియర్ డివిజన్)కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముస్లిం పక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. గడువు పొడిగింపునకు తాను చేసిన విజ్ఞప్తిపై “ఫైల్లో ఉంచండి” అని మాత్రమే కోర్టు వ్యాఖ్య రాసిందని రమేశ్ సింగ్.. విలేకరులతో పేర్కొ న్నారు. ఈ కేసులో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సివిల్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జనవరి 6న హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో 15 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. నివేదిక దాఖలుకు మరింత గడువు కోరడంపై తాను లిఖితపూర్వకంగా అభ్యం తరాలు వ్యక్తంచేసినట్లు ముస్లిం పక్షాల తరపు న్యాయవాది షకీల్ అహ్మద్ చెప్పారు. అడ్వకేట్ కమిషనర్ తో మసీదు సర్వేకు స్థానిక కోర్టు నవంబరు 19న ఆదేశాలిచ్చింది. 1526లో మొగల్ చక్ర వర్తి బాబర్ ఒక ఆలయాన్ని నేలకూల్చి సంభల్ మసీదును నిర్మించారని హిందూ పక్షాలు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులిచ్చింది.