News

మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే పాలన సాగాలి : జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్

292views

మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే దేశంలో పరిపాలన జరగాలని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి పౌరస్మృతి విషయంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూనిఫాం సివిల్ కోడ్ ను వీహెచ్ పీ, ఆరెస్సెస్ సంస్థలు సూచించలేదన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా దీని గురించి మాట్లాడిందని గుర్తు చేశారు. అతి త్వరలోనే దేశంలో ఒకే పౌరచట్ట అమలులోకి వస్తుందని, ఇది అతి దగ్గర్లోనే వుందని నొక్కి చెప్పారు.

‘‘ఇది హిందుస్థాన్ అని చెప్పడానికి నాకెలాంటి సంకోచమూ లేదు. ఈ దేశం మెజారిటీల అభీష్టం మేరకే నడవాలి. ఇది చట్టం. ’’ అని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు.అంటరానితనం, సతిసహగమనం లాంటి మూఢాచారాలు రద్దయ్యాయని, కానీ.. ముస్లిం సమాజం ఇప్పటికీ బహుభార్యత్వాన్ని ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించారు. ప్రతి మతం కూడా హానికరమైన వాటిని స్వయంగా తొలగించాలని సూచించారు. అలా విఫలమైతే దేశం యూసీసీని అమలుచేస్తుందని అన్నారు.

హిందూ శాస్త్రాల్లో, ధర్మాల్లో, వేదాల్లో స్త్రీని దేవతగా గౌరవించారని అన్నారు. కానీ.. బహు భార్యత్వం, హలాల్, ట్రిపుల్ తలాక్ వంటివి మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మహిళలకు భరణం కానీ, అన్యాయాన్ని కానీ సహించడానికి వీలేలేదన్నారు. హిందువులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే దయ అన్న గుణాలను నేర్పుతారని, జంతువులపై, ప్రకృతిపై నేర్పుతామన్నారు. అలాంటి పిల్లల ముందే జంతువులను వధిస్తే వారెలా ఒప్పుకుంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు.