News

వినాయకుడ్ని అవమానించిన వాల్ మార్ట్.. చెప్పులు, లోదుస్తులపై బొమ్మలు

374views

వాల్ మార్ట్ సంస్థ హిందూ దేవతలను, హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పాదరక్షలు, షార్టులు, సాక్స్ లపై, లోదుస్తులు, ప్యాంట వినాయకుడి బొమ్మలను ముద్రించి అమ్మడం ప్రారంభించింది. దీనిపై భక్తులు, హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా దాదాపు 70 శాతం దుస్తులను ఇప్పటికే విక్రయించినట్లు సమాచారం. హిందూ దేవతల చిత్రాలను అనుచితంగా ఉపయోగించడంపై హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తాయి. వాల్ మార్ట్ హిందూ మనోభావాలను అగౌరవపరుస్తోందని మండిపడుతున్నారు.మరో వైపు హిందూ ఉద్యమకారుడు రాజన్ జెడ్ కూడా అమెరికన్ రిటైల్ దిగ్గజం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి, అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవతలను ఇలా ఉపయోగిస్తున్నారన్నారు.