
అయ్యప్ప మాలధారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు జంక్షన్ మీదుగా శబరిమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–కొట్టాయం (నం.07163) మధ్య ఈ నెల 20, 27 తేదీల్లో రైళ్లు నడుస్తాయన్నారు. ఆయా రోజుల్లో హైదరాబాద్ జంక్షన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు కొట్టాయం చేరతాయన్నారు. తిరిగి అక్కడి నుంచి 21, 28వ తేదీల్లో నడుస్తాయన్నారు. రాత్రి 9.45 గంటలకు కొట్టాయంలో రైళ్లు బయలుదేరి హైదరాబాద్ జంక్షన్‌కు మరుసటి రోజు అర్ధరాత్రి 12.30 గంటలకు చేరతాయన్నారు. బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుపూర, పాల్కడ్, తిరుసుర్, ఎర్నాకులం టౌన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు.





