
258views
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేణుగోపాలస్వామి ఆలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్శంగా హిందూ సంఘాల నాయకులు పెంట స్వామినాయుడు, పువ్వల శ్రీనివాసరావు, కొల్లూరు జగన్నాథరావు మాట్లాడుతూ హైందవ జాతిపై అక్కసుతో అనేక మంది ముష్కరులు ఇష్టారాజ్యంగా హింసకు దిగుతున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో మానవహక్కుల ఉల్లంఘన నిలిపివేయాలని, దేవాలయలపై దాడులు, హిందువులపై మారణహోమం ఆపాలని కోరారు.అనంతరం హెచ్‌డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ రావాడ సత్యనారాయణ, చెలికాని కేశవ, గెంబలి శ్రీనివాసరావు,సుంకరి సాయిరమేష్, బీసపుపార్వతి, అల్లు స్వామి నాయుడు, అనిల్ పాల్గొన్నారు.





