
369views
ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రచార వాహనాలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ దేవదాయ కమిషనర్ ఎన్. సత్యనారాయణదర్శించారన్నారు. ఆయనకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి తీర్థప్రసాదాలతో పాటు మంగళా శాసనం అందజేశారని తెలిపారు. ఈనెల 16నుంచి జనవరి 13వరకు ధనుర్మాస కార్యక్రమాలను మంగళగిరి పట్టణ పరిధిలోని బాపూజీ విద్యాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





