News

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

298views

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలారావు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిడి ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో టిటిడి ఇఓ మాట్లాడుతూ ఈనెల 28నుంచి డిసెంబర్ 6వతేదీ వరకు తిరుచానూరు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు.