News

పల్నాడు జిల్లా దాచేపల్లిలో టిప్పు సుల్తాన్‌ ర్యాలీ

376views

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో బుధవారం జరిగిన టిప్పు సుల్తాన్‌ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం వ్యక్తులు కొందరు జెండాలు పట్టుకుని టిప్పు సుల్తాన్‌ ర్యాలీ చేస్తూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు. దీంతో కారంపూడి రోడ్డు సెంటర్‌కు ర్యాలీ వస్తున్న క్రమంలో ఈ ర్యాలీని ప్రతిఘటించడానికి హిందువులు చత్రపతి శివాజీ ఫొటోలు చూపిస్తూ నినాదాలు వేశారు. దీంతో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ముస్లింలు, హిందువులుపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో పోలీసులు అందరినీ అక్కడి నుంచి పంపించారు.