News

ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార సమయంలో జాతీయ గీతానికి అవమానం…

293views

ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో జాతీయ గీతానికి తీవ్ర అవమానం జరిగింది.ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే హిలాల్ అక్బర్ లోన్ జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జాతీయ గీతాలాపన సమయంలో హిలాల్ అక్బర్ లేని నిలబడలేదని సోషల్ మీడియా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడం, తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు ప్రాథమిక దర్యాప్తును కూడా ప్రారంభించారు.BNSS సెక్షన్ 173 (3) ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే హిలాల్ అక్బర్ స్పందించారు. జాతీయ గీతాన్ని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశానని, జాతీయ గీతాన్ని ఎందుకు అగౌరవపరుస్తానని ఎదురు ప్రశ్న వేశారు. జాతీయ గీత ఆలాపన సమయంలో తాను లేచి నిల్చున్నానని, వెన్నునొప్పి కారణంగానే కూర్చున్నానని పేర్కొన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఎక్కువని, అందుకే కూర్చున్నానని అన్నారు.