
388views
ఓం విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక మరియు హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదికను ప్రారంభించారు. భాగ్యనగర్ లో జరిగిన కార్యక్రమంలో 45 మంది పీఠాధిపతులు, 100 పైగా హిందూ సంఘాలు సంస్థలు పాల్గొన్నాయి.
ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.
ఈ సమావేశంలో సనాతన ధర్మబోర్డ్ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని పీఠాధిపతులు హిందూ సంఘ నాయకులు కలిసి వినతి పత్రం అందజేయాలని తీర్మానించారు.రెండవ తీర్మానంగా ప్రతి ఆరు మాసాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఇటువంటి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పూజ, మఠ, పీఠ ఆశ్రమాధిపతులు హిందూ సంఘ నాయకులు సంయుక్తంగా రెండు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల సందర్శన, ప్రసాదం పోటుల పర్యవేక్షణ మూడో తీర్మానంగా సమావేశంలో నిర్ణయించారు.




