News

మెట్రోలో నవరాత్రి సందడి

127views

దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్‌ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది. ఈ వీడియో క్యాప్షన్‌గా ‘జై మాతా ది’ అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి గిటార్ ప్లేచేస్తూ పాటలు పాడుతుండగా, అక్కడున్న ఇతర ప్రయాణికులు అతనితో కలిసి పాడటం కనిపిస్తుంది. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్‌ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు.