
963views
విదేశీ విష సంస్కృతి కారణంగా వెర్రి పోకడలు పోతున్న నేటి కాలంలో.. కర్నూలు జిల్లా నంద్యాలలో వినూత్న రీతిలో వినాయక నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. వెర్రి కేకలు, పిచ్చి గంతులు, చెవులు దిబ్బిల్లు పడే డీజే శబ్దాలు, డప్పుల మోతలు లేకుండా సాంప్రదాయ పద్ధతిలో పార్వతీ తనయుడిని ఎంతో భక్తి ప్రపత్తులతో షోడశోపచార పూజలతో నవకాయ పిండివంటలతో ఆరాధించిన మాతామణులు నిమజ్జనం రోజు భక్తి పారవశ్యం పరవళ్లు తొక్కగా సనాతన సాంప్రదాయాన్ని తలంపునకు తెస్తూ దీపాలు చేతబూని ముందునడవగా సాగిన వినాయక నిమజ్జనోత్సవం పురజనులను విశేషంగా ఆకట్టుకునింది. కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలు ఈ అపురూప దృశ్యాన్ని చూసి రెప్ప వేయడం కూడా మరచి నిలుచుండి పోయారు.

భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలైన మాతృ మూర్తులు ఆద్యంతమూ ముందుండి నడిపించిన ఈ నిమజ్జనోత్సవం అందరినీ అబ్బురపరచిందనటంలో అతిశయోక్తి లేదు.





