News

తెనాలిలో ఆర్. ఎస్. ఎస్ మహా సాంఘిక్

281views

గుంటూరు జిల్లా తెనాలిలోని తాలూకా హైస్కూలు నందు ఆదివారం నాడు జరిగిన ఆర్. ఎస్. ఎస్ మహా సాంఘీక్ జరిగింది. ఆర్. ఎస్. ఎస్ లో ప్రతి రోజూ శాఖలు జరుగుతాయన్నది మనకందరికీ తెలిసిందే. ఈ శాఖలలో పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ వయో స్థాయీ బేధాలకు అతీతంగా పాల్గొని వ్యాయమమూ, ఆటలు, పాటలతో ఆరోగ్యాన్ని, దేశభక్తినీ పెంపొందించుకుంటూ ఉంటారు.

అలాంటి 16 శాఖలు తెనాలి నగరం మొత్తం మీద వివిధ ప్రదేశాలలో ప్రతి రోజూ జరుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న స్వయంసేవకులు ఆయా శాఖలలో పాల్గొంటూ వుండడం పరిపాటి. అలాగే నెలకొక్కసారి సాంఘీక్ పేరుతో ఆయా శాఖలలోని స్వయంసేవకులందరూ నగరంలోని వివిధ ప్రాంతాలలో కలుస్తూ ఉంటారు. అయితే స్థానిక కార్యకర్తలకు ఈసారి ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది. “అన్ని శాఖల వారము ఒకే చోట కలుస్తున్నాం సరే. అన్ని శాఖలు ఒకే చోట జరిగితే?” ఆలోచన వచ్చిందే తడవు నగరంలోని స్వయంసేవకులందరికీ సమాచారం చేరిపోయింది. అంతే ఆదివారం నాడు ఆన్ని శాఖలూ ఒకే చోట స్థానిక తాలూకా హైస్కూలు ప్రాంగణంలో జరిగేలా నిర్ణయమైపోయింది.

ఈ మహా సాంఘీక్ లో షుమారు 300 మందికి పైగా స్వయంసేవకులు పాల్గొనడం విశేషం. పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతమూ ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్. ఎస్. ఎస్ గుంటూరు విభాగ్ ప్రచారక్ శ్రీ మల్లిఖార్జున పాల్గొని మార్గదర్శనం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.