News

బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

49views

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవలి నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై మోదీ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ అభివృద్ధిని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఉంటుందని, అక్కడి పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని భారతీయులు కోరుకుంటున్నారని మోదీ అన్నారు.

52 జిల్లాల్లో మతపరమైన దాడులు..
బంగ్లాదేశ్ జనాభాలో మైనారిటీ వర్గాలు 8 శాతం మంది ఉన్నారు. ఈ వర్గాలు సాంప్రదాయకంగా షేక్ హసీనా సారధ్యంలోని అవామీ లీగ్ పార్టీకి మద్దతు ఇస్తుంటారు. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ లెక్కల ప్రకారం.. ఆగస్టు 5 తర్వాత దేశంలో మొత్తం 64 జిల్లాలు ఉండగా కనీసం 52 జిల్లాల్లో మత హింసకు సంబంధించిన ఘటనలు జరిగినట్టు స్పష్టం చేసింది