News

‘దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలి’

54views

హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్‌ నాయకులు కోరారు. విశ్వహిందూ పరిషత్‌ అన్ని ధార్మిక వ్యాపార, కుల సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. భరతమాత దేవాలయం నుంచి కల్పన సెంటర్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమల వేంకటేశ్వరస్వామి మహాప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని, అన్యమత ఉద్యోగులను దేవాలయ విధుల నుంచి తొలగించాలని కోరుతూ దేశ వ్యాప్త నిరసన ఉద్యమంలో భాగంగా నంద్యాలలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి, బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పోలేపల్లి సందీప్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార కార్యదర్శి చింతలపల్లె వాసు, కార్యకర్తలు పాల్గొన్నారు.