News

కాంచీపురంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగు శాసనం

11views

కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగుశాసనం బయటపడింది. శివపార్వతులు, స్కంధ విగ్రహాల పీఠంపై ఈ శాసనం లిఖించి ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందినదని పురావస్తు శాఖాధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాలు అమెరికాలోని ఆసియన్‌ ఆర్ట్‌ మ్యూజియంలో భద్రపరిచారు. తొండమండల ప్రాంతానికి చెందిన వెల్లకొండమనాయని కుమారుడు, రాఘవనాయని ముడుమన్నరప్ప నాయని మనవడైన వెంకట్రామ నాయని ఏకాంబరేశ్వర ఆలయానికి 11 విగ్రహాలు బహూకరించినట్లు శాసనం పేర్కొంటోంది.