News

ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి శివాజీ కోటలు

49views

మొన్నటికి మొన్న శివాజీ మహారాజ్‌ అఫ్జల్‌ ఖాన్‌ని చంపడానికి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన పులిగోళ్లు లండన్‌ నుంచి భారత్‌కి చేరాయి. తాజాగా మహారాష్ట్ర సర్కార్‌ శివాజీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. శివాజీ కాలం నాటి 12 కోటలను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చినట్లు ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే ప్రకటించారు. ఈ మేరకు తాము ప్రతిపాదనలు కూడా పంపామన్నారు. ఆ కోటలు కేవలం వాస్తుశిల్పాలు మాత్రమే కావని, అవన్నీ చారిత్రక వారసత్వ సంపద అని తెలిపారు. ఈ వారసత్వాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం తప్పకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ వారసత్వ సంపద జాబితాలో సల్హేర్‌, శివనేరి, లోప్‌ాఘర్‌, రాయగఢ్‌, సువర్ణదుర్గ, పన్హాలా, విజయదుర్గ్‌, సింధు దుర్గ్‌, ఖండేరి, రాజగఢ్‌, ప్రతాప్‌గఢ్‌ వంటి 11 కోటలు మరియు తమిళనాడులోని జింగీ వంటి కోటలు కూడా వున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి షిండే ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. శివాజీ మహరాజ్‌ జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి మదిలో పదిలంగానే వున్నాయని సీఎం పేర్కొన్నారు.