News

18న అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు

49views

ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలానికి ఈ నెల 18వ తేదీన వైయస్సార్ జిల్లాలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి ఉదయం 6 గంటలకు రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా అరుణాచలానికి సూపర్‌ లగ్జరీ సర్వీసు నడుపుతున్నామన్నారు. పెద్దలకు రూ.1277 ఛార్జి ఉంటుందన్నారు.

● బద్వేలు డిపో నుంచి ఉదయం 7 గంటలకు పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్‌ టెంపుల్‌, కాణిపాకం మీదుగా రెండు సూపర్‌ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ బస్సుల్లో రూ.1668 ఛార్జీ ఉంటుందన్నారు. మరో రెండు బస్సులు ఉదయం 7 గంటలకు కడప, గోల్డెన్‌ టెంపుల్‌, కాణిపాకం మీదుగా వెళ్తాయని, వాటిలో ఛార్జీ రూ.1494గా ఉందన్నారు.

● మైదుకూరు డిపో నుంచి ఉదయం 6 గంటలకు ప్రత్యేక బస్సు పోరుమామిళ్లలో బయలుదేరి కడప, కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా వెళ్తుందని, ఇందులో ఛార్జి రూ. 1414గా ఉందన్నారు. ● ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మైదుకూరు, కడప మీదుగా అరుణాచలానికి వెళ్తుందని, ఇందులో రూ.1273గా ఛార్జి ఉందన్నారు.

● పులివెందుల డిపో నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి రాయచోటి, పీలేరు మీదుగా అరుణాచలానికి వెళ్తుందన్నారు. ఇందులో రూ. 1242 ఛార్జి ఉందన్నారు.