News

కులాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలి : పరిపూర్ణానంద స్వామి

53views

తిరుపతి జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమంలో బుధవారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మలయాళ స్వామి ప్రతిబింబిస్తూ మోక్షానికి అర్హత కులమా గుణమా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామీజీ తన సందేశంలో ప్రపంచంలోని 84 లక్షల జీవరాశులలో మానవజన్మ ఎంతో శ్రేష్టమన్నారు. 211 ప్రపంచ దేశాలలో భారతదేశం ఎంతో గొప్పదని తెలిపారు. సామాజిక సమరసత చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. పుస్తక రచయిత వల్లిశ్వర్ తన సందేశంలో మలయాళ స్వామి రచనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని ఆయన రచించిన గ్రంథాలను వాటి భావాలను వివరించారు. పుస్తకంలోని ప్రధాన సారాంశాలను విపులీకరించారు. వేదిక అధ్యక్షులు పి వీరాస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రధాన వక్తలు వేణుగోపాల్ నాయుడు సమరసత సాధనకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమరసత సంయోజకులు రాగాల నర్సింగరావు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు మన్మధరావు, అంజూరు, బాలసుబ్రమణ్యం శంకరయ్య, నెల్లూరు జిల్లా వేదిక అధ్యక్షులు నేలనూతల శ్రీధర్, సమరసత నాయకులు భాస్కర్ రెడ్డి సుబ్బరామిరెడ్డి అమరనాథరెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖు డాక్టర్ రేణు దీక్షిత్ తో పాటు వెంకటగిరి నెలూరు శ్రీకాళహసి తిరుపతి నుంచి వేదిక ప్రముఖులు సానిక నాయకులు పాల్గొన్నారు.