News

హిందుస్తాన్‌లో వుండాలంటే యా హుస్సేన్‌ అనాల్సిందే… అంటూ మొహర్రం ఊరేగింపులో ఛాందసుల నినాదాలు

45views

మొహర్రం సందర్భంగా ముస్లీం ఛాందసులు యూపీలోని అమేథీలో భయాందోళనలు లేపారు. అమేథీలోని వాతావరణాన్ని చెడగొట్టారు. హిందుస్తాన్‌లో వుండాలంటే యా హుస్సేన్‌ అని అనాల్సిందే (హిందుస్తాన్‌ మే రెహనా హైతో యా హుస్సేన్‌ కెహనా హోగా’) అంటూ నినాదాలు చేస్తూ భయాందోళనలు రేపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్‌ గెలిచిందని, ఇప్పుడు అక్కడ ఇలాంటి నినాదాలు వినిపిస్తున్నాయని సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ఈ సంఘటనపై స్థానిక ఎస్పీ స్పందించారు.

ఈ నినాదాలకు సంబంధించిన వీడియోలను తాము పరిశీలిస్తున్నామని, అలా నినాదాలిచ్చిన ముస్లిం ఛాందసులను గుర్తించి, సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.ఇక.. ఈ ఘటనపై స్వామి పరమహంస ఆశ్రమం పీఠాధిపతి మౌనీజీ మహారాజ్‌ మాట్లాడుతూ.. పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఇలాంటి అభ్యంతరకర నినాదాలు చేస్తున్నారని, భయానక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు ఉద్దేశాలున్న ఛాందసులపై యోగి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి మూలాలు కచ్చితంగా పాక్‌ కేంద్రంగా వుంటాయని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయన్నారు. దీని వెనుక రాజకీయ కుట్రలు దాగి వున్నాయని పేర్కొన్నారు.