News

అమ్మవారి సారె వినూత్నంగా..

282views

ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు భక్తులు వినూత్నంగా ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. కొంతమంది పళ్లు, పులిహోర, మిఠాయిలు తీసుకొస్తే.. మరికొందరు రోళ్లు, రోకళ్లు, తిరగలి, సన్నికల్లు, రుబ్బురోళ్లు, బిందెల రూపాల్లో మిఠాయిలు తయారుచేయించి సమర్పిస్తున్నారు. విజయవాడకు చెందిన మహిళా భక్తులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వీటిని తయారుచేయించి ఇంద్రకీలాద్రికి తెస్తున్నారు.