News

జగన్మాత దుర్గమ్మకు భాగ్యనగర్‌ బోనం

410views

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాగ్యనగర్‌ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి జగన్మాత దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం సమర్పించారు. ముందుగా సీవీ రెడ్డి ఛారిటీస్‌ స్థలంలో బోనం సిద్ధం చేయగా.. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులతో కలిసి దుర్గ గుడి ఈవో రామారావు ప్రదర్శనను ప్రారంభించారు. అక్కడి నుంచి కళాకారులు, పోతురాజులు ప్రదర్శనగా వచ్చి అమ్మవారికి బంగారు బోనం, పవిత్ర సారె సమర్పించారు. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదాలను అందజేశారు. ఈ సంప్రదాయం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. కార్యక్రమంలో బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.