News

ధర్మవరంలో జగన్నాథుడికి ప్రత్యేక పూజలు

237views

పూరిలో జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్‌యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథ్‌, బలరామ, సుభద్ర ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు హరినామసంకీర్తన చేశారు. ధర్మవరం ఇస్కాన ధర్మప్రచారకులు శ్రీకృష్ణమాధవదాస్‌ ఉపన్యాసించారు.

జగన్నాథుడి అలంకరణలో త్రిలింగేశ్వరుడు
పట్టణంలోని తేరుజజార్‌ సమీపంలో బసవన్నవీధిలో వెలసిన త్రిలింగేశ్వరుని ఆలయంలో ఆదివారం పూరిజగన్నాథుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూరిలో శ్రీజగన్నాథుడి రథోత్సవంలో భాగంగా ఆలయఅర్చకుడు రాఘవశర్మ ప్రత్యేకంగా త్రిలింగేశ్వరునిపై జగన్నాథుడి అలంకరణ చేశారు.