
నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆద్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5 ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని తీర్మానించింది.
నంద్యాలలో స్థానిక పీఏవి టవర్స్ IV లో “పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత ” నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో సంఘమిత్ర వ్యవస్థాపకులు డాక్టర్ కాదర్ బాద్ ఉదయ శంకర్ మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు ఆస్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్య, విలువలతో పాటు చక్కని పర్యావరణం కూడా అందించడం మన కర్తవ్యమని తెలిపారు. పర్యావరణ విస్తృతిని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగం పై కట్టడి, విద్యుత్ దుర్వినియోగం, గ్లోబల్ వార్మింగ్ వంటి విషయాలని వివరించారు.
వినియోగదారుల ఆలోచనలో స్వచ్చంద మార్పు వస్తే తప్ప, యంత్రాంగం, చట్టాలతో మార్పు సాధ్యం కాదని, ఆ మార్పేదో మనతోనే ఎందుకు ప్రారంభం కాకూడదు అని ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు.

అలాగే వాసవి ప్యారడైజ్ లో జరిగిన కార్యక్రమంలో ” మా ఇంట్లోకి ప్లాస్టిక్ భూతాన్ని రానివ్వం ” అంటూ ఇచ్చిన పిలుపు సకారాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. ఆ అపార్ట్ మెంటు లో జరిగిన కార్యక్రమంలో ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడా వాడకుండా అన్ని స్టీలు వస్తువులే వాడేలా నిర్ణయించారు.రాబోయే కాలంలో జరిగే పెళ్ళిరోజు, పుట్టిన రోజు వంటి కార్యక్రమాల్లో అందమైన జూట్ సంచులు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అధ్యక్షులు బీయస్ శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి యస్ వి ప్రసాద్, కోశాధికారి వైవి రామస్వామి, ఉపాధ్యక్షులు పి రవికుమారు, సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు, చిన్నారులు అపార్ట్ మెంటు వాసులు 50 మందికి పైగా చర్చలో ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.





