News

తలుపులమ్మ లోవలో ఆషాఢ మాస ఉత్సవాలు

161views

ఆషాడమాస ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు. సుమారు 40 వేలమంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి రికార్డు స్థాయిలో రూ.9.61 లక్షలు ఆదాయం సమకూరినట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు తెలిపారు. ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలతో పాటు సుమారు 60 మంది పోలీసులు, 80 మంది వాలంటీర్లు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు.