ఆంధ్ర ప్రదేశ్ లో 175 శాసన సభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు , హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాకెట్ ఓట్లు, హోం ఓట్లు, సర్వీసు ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్, తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే EVM ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేశారు. సి సి కెమెరాల పర్వక్షణలో లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి పోస్టల్ బ్యాలెట్ లు అధిక సంఖ్యలో 4 లక్షల 61 వేలు పోలయ్యాయి.
380views
You Might Also Like
ఏబీవీపీ ‘‘విద్యార్థి మహాకుంభ’’
44
రాజ్యాంగ విలువల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ‘అరాచకాన్ని ఆపండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అనే నినాదంతో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భారీ...
కొచ్చి వంతెనపై ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు…
32
కొచ్చి : కొచ్చి సమీపంలోని ఆలూవాలో మార్తాండ వర్మ వంతెన సమీపంలోని రోడ్డుపై ఆజాదీ’, ‘ఆర్ఎస్ఎస్ను నిషేధించండి’ అంటూ నినాదాలు వెలిశాయి. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర...
‘గంగాజలాల’పై భారత్ కఠిన వైఖరి.. ‘బంగ్లా’కు కొత్త షరతులు!
30
భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలకమైన గంగా నదీ జలాల పంపిణీ ఒప్పందం పునరుద్ధరణ అంశం కొత్త మలుపు తిరిగింది. 1996లో కుదిరిన ఫరక్కా గంగా జలాల ఒప్పందం...
ఆ గ్రామంలో వారం ముందుగానే దీపావళి వేడుకలు
37
దేశమంతా దీపావళి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతున్న వేళ, ఛత్తీస్‌గఢ్‌లోని ఒక గ్రామంలో మాత్రం వారం రోజుల ముందుగానే సంబరాలు మొదలయ్యాయి. అక్కడ దీపావళి ఒక్కటే కాదు హోలీ,...
పర్యావరణ పరిరక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి…..
39
పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ మార్పు ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి...
వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి.. అధ్యక్షుడికి ‘హనుమాన్ చాలీసా’ బహుమతి
40
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని తన అధికారిక కార్యాలయం ఓవల్ ఆఫీస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ...




