News

కాలిఫోర్నియాలో పెరుగుతున్న హిందూ ఫోబియా

96views

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్నాయి. అత్యధికంగా యూదులపై ఈ దాడులు జరుగుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో హిందువులు, ముస్లింలు ఉన్నారు. కాలిఫోర్నియా పౌర హక్కుల శాఖ ఈ వివరాలను వెల్లడించింది.కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగం నివేదిక ప్రకారం, విద్వేష దాడుల్లో 36.9% యూదులపై జరుగగా, హిందువులపై 23.3%, ముస్లింలపై 14.6% దాడులు జరిగాయని తెలిపింది.

భారతీయ-అమెరికన్లపై, ప్రత్యేకించి హిందువులపై ద్వేషపూరిత నేరాల ఆకస్మిక పెరుగుదల హిందూ సమాజాన్ని ఆందోళనను గురిచేస్తున్నాయి. ముఖ్యంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించడం, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా బెదిరింపులు వంటి సంఘటనలకు సంబంధించి వంటివి జరుగుతున్నాయని భారతీయ-అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.