News

అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రం

108views

అయోధ్య రాముడికి తాము నేచిన వస్త్రాలు ధరింప చేయడంపై దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోడ శ్రీనివాస్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతీ సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ రంగులతో తయారు చేసిన వస్త్రాలను రాముడికి అలంకరించేందుకు దిల్లీకి చెందిన డిజైనర్‌ మనీశ్‌త్రిపాఠి ఎంపిక చేస్తారని ఈ క్రమంలో దుబ్బాకలో తయారైన లెనిన్‌ చేనేత వస్త్రం డిజైన్లు నచ్చి తమ కంపెనీకి అర్డర్‌ ఇచ్చారని శ్రీనివాస్‌ వివరించారు. ప్రస్తుతం రెండు రంగులతో కూడిన రెండు డిజైన్‌ లినిన్ ఇక్కత్‌ వస్రాలను అందించడం జరిగిందన్నారు. ప్రతీ వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుందన్నారు.

శ్రీరాముడికి ఆదివారం పింక్‌ కలర్‌ వస్త్రాన్ని అలంకరణ చేసే నిబంధన ఉండటంతో తాము తయారు చేసిన వస్త్రాన్ని అలంకరించినట్లు డిజైనర్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు సమాచారం అందించారన్నారు. మరో ఐదు రోజులకు ఐదు డిజైన్లతో కూడిన వస్త్రాలను అందిస్తామన్నారు.