News

పిఓకె స్వాధీనం చేసుకుంటాం.. అణుబాంబులకు అస్సలు భయపడం

79views

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్ లో అంతర్భాగమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. తమను భయపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పొరుగు దేశం(పాకిస్థాన్) వద్ద అణు బాంబులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తోందని అమిత్ షా హిమాచల్ ప్రదేశ్​లో ఉనాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో తెలిపారు.

“అభివృద్ధి అనేది బీజేపీకి అలవాటే. పీఓకే గురించి మేం మాట్లాడితే కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్‌ వద్ద అణు బాంబులు ఉన్నాయని భయపెడుతున్నారు. అణుబాంబులకు భయపడం. పీఓకే భారత్​కు చెందిన భూభూగం. దాన్ని స్వాధీనం చేసుకుంటాం” అని తేల్చి చెప్పారు. భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్‌ ఎంపీకి దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. భారతదేశ వ్యవహారాల్లో తల దూర్చకుండా ‘మీ దేశం సంగతి మీరు చూసుకోండి’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.