News

తమ ప్రాంతాల్లో ముస్లిం స్థావరాలను తొలగించాలంటూ తెలంగాణ గిరిజనుల తీర్మానం

98views

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా జైనూరులోని వడ్డెర బస్తీలో మే 13న సుమారు 7వందల మంది ముస్లింల గుంపు స్థానిక గిరిజనులపై ఇనపచువ్వలు, కర్రలతో దాడి చేసి వారిని భయభ్రాంతులను చేసారు. వారి దాడిలో ఒక గిరిజన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిప్పుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే, అయినా నిలకడగానే ఉంది. ఆ సంఘటనపై శ్రీ గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ కమిటీ తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని జిల్లా ఎస్‌పికి పంపించింది.

గిరిజనుల భూముల్లో నివసిస్తున్న గిరిజనేతరుల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించాలన్న డిమాండ్‌తో జిల్లా కలెక్టర్‌ను, ఉన్నతాధికారులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మే13 దాడి ఘటనలో దోషులపై తక్షణం చర్య తీసుకోవాలనీ, వారిని కఠినంగా శిక్షించాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

సుమారు 7వందల మంది ముస్లిములు కలిసి గిరిజన ప్రాంతాల్లోని స్థానిక ప్రజలను భయభ్రాంతులను చేయడం, ఒక యువకుడిపై దాడి చేయడం జాతీయ మానవహక్కుల కమిషన్ దృష్టికి సైతం వెళ్ళింది. ఎన్ఎచ్‌ఆర్‌సి ఆ ఘటనపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే స్థానిక పోలీసులు అలసత్వంతో వ్యవహరిస్తుండడాన్ని గోండు గిరిజనులు తప్పుపడుతున్నారు. ఆ దాడి కేసును రాష్ట్ర గవర్నర్‌, కేంద్ర గిరిజన కమిషన్‌ ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు.