News

నేటి నుంచి అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు

87views

తాళ్లపాక అన్నమాచార్యులవారి 616వ జయంతి ఉత్సవాలు ఈ రోజు (మే 23) నుండి 29వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా తాళ్లపాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం శ్రీవారి కల్యాణం నిర్వహించారు.

తాళ్లపాకలో..
మే 23 నుండి 25వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తాళ్లపాక‌లోని ధ్యాన‌మందిరం , 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుపతిలో..
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే24 నుంచి29 వరకు ఉదయం 9 గంటలకు సప్తగిరి గోష్టిగానం, సాయంత్రం 6 గంటలకు సంగీత సభ జరగనుంది. మే 23 నుండి 29వ తేదీ వరకు ఉదయం 10.00 గంటలకు సాహితీ సదస్సు, సాయంత్రం 6 గంటల నుండి ప్రముఖ విద్వాంసుల గాత్ర, వాద్య, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.