News

రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం

282views

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు ఈ కల్యాణ తంతు ఉంటుంది. 18న స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరిస్తారు. 19న కల్యాణం, 20న అరుంధతి నక్షత్ర దర్శనం, రావణ బ్రహ్మ వాహన సేవ, 21న పండిత సదస్యం, పొన్న వాహన సేవ, 22న వనవిహారోత్సవం, రథోత్సవం జరగనున్నాయి. ఈ ఏడాది రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం 34.1 అడుగుల ఎత్తుతో భారీ రథాన్ని రూ.1.08 కోట్లతో తయారు చేయించారు. 22న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. 23న శ్రీ చక్రస్నానం, 24న శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఈవో కె. రామచంద్రమోహన్‌ తెలిపారు.