News

ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో ప్ర‌ధాని పూజ‌లు

269views

ప్ర‌ధాని మోదీ ఇవాళ వార‌ణాసిలో లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గంగా న‌ది తీరంలో ఉన్న ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య ఆయ‌న గంగా హార‌తి నిర్వ‌హించారు. ప్ర‌ధాని మోదీతో పూజారి రామ‌ణ్ పూజ‌లు చేయించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశ ప్ర‌ఖ్యాత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెలిగిపోవాల‌ని కోరుకున్న‌ట్లు పూజారి రామ‌ణ్ వెల్ల‌డించారు.ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక క్రూయిజ్ బోట్‌లో విహ‌రించారు. సోమ‌వారం రాత్రి ప్ర‌ధాని మోదీ.. కాశీ విశ్వేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఇవాళ ఆయ‌న నామినేష‌న్ ఫైల్ చేయ‌డానికి ముందు కాల‌భైర‌వుడిని కూడా ద‌ర్శించుకున్నారు.