News

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

2.5kviews

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి ఈరోజు నిర్వహించింది. ఈరోజు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో నేడు జపగాల్సిన క‌ల్యాణోత్స‌వం , సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.