వైయస్సార్ జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరు ణాల గురువారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాల ను శుభముహుర్తాన వేద పండితు లు అధిష్టింపచేశారు. ఈ సందర్భం గా భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మధ్యాహ్నం కొంత దూరం వరకు లాగి నిలిపి సాయంత్రం మళ్ళీ రథాన్ని యథాస్థానానికి లాగారు. ఈ తిరుణాలకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటుగా కర్నాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా గురువారం రాత్రి గరుడోత్సవ వేడుకలను నిర్వహించి స్వామి వారికి పూజలు చేశారు. తిరుణాలకు వచ్నిన భక్త్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను ఊరేగించి భక్తులు స్వామి వారిని దర్శించుకుని తలనీలాలను సమర్పించారు.
243views
You Might Also Like
అఖండ గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు
అమరావతి: గోదావరి మహానదిని ఆరాధిస్తూ.. పుణ్యస్నానాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది....
కశ్మీరీ పండిట్ల ఊచకోతపై 28 ఏళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు
5
జమ్మూకాశ్మీర్ లోని వాందామాలో 1998లో 23 మంది కశ్మీరీ పండిట్ల నరమేధంపై ఆ రాష్ట్ర దర్యాప్త సంస్థ(ఎసీఐఏ) పునర్విచారణ ప్రారంభించింది. లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు సంబంధించిన...
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..
6
పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది....
భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?
34
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్‌లోని సింగ్భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5...
పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన
31
పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్‌లోని సిక్కు సమాజం పాకిస్తాన్‌పై పోరాటం...
స్వామి లక్ష్మణానంద శత జయంతి వేడుకలు ప్రారంభం
17
భువనేశ్వర్ : మత ఛాందసుల చేతిలో ఘోరంగా హత్యకు గురైన స్వామి లక్ష్మణానంద శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన జన్మస్థలమైన గురుజంగ్ కేంద్రంగా ఇవి ప్రారంభమయ్యాయి....





