News

‘పీఎస్ఎల్వీ’ కొత్త ఇంజిన్ పరీక్ష సక్సెస్

340views

భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో)కు ఎంతో నమ్మకమైన రాకెట్గా గుర్తింపు పొందిన పీఎస్ఎల్వీ రాకెట్ కు నాలుగో దశలో సరికొత్తగా ఒక ఇంజిన్ ను డిజైన్ చేసి గురువారం పరీక్షించి శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ ఇంజిన్ ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో డిజైన్ చేయగా తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్ లో ఇంజిన్ కు పరీక్ష నిర్వహించారు. ఈ ఇంజిన్ కు 665 సెకన్లపాటు మండించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీని వల్ల ప్రయోగానికి అయ్యే వ్యయం కూడా తగ్గుతుందని శాస్త్ర వేత్తలు చెప్పారు. రాబోయే పీఎస్ఎల్వీ రాకెట్ లో ఈ ఇంజిన్ ను ఉపయోగించి ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమమవుతున్నామని పేర్కొన్నారు.