
306views
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయోధ్యలో పర్యటించి బాల రాముడిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య రామ్ లల్లా ను తొలుత నిలబడి ఆపై మోకాళ్ళపై కూర్చొని స్వామికి మొక్కారు. ఈ వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం ‘ఎక్స్’లో షేర్ చేసింది. అందులో రామ్ లల్లా విగ్రహం ముందు కూర్చొని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మొక్కుతుండగా వెనకాల నుంచి జై శ్రీరాం నినాదాలు వినిపించాయి.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కేరళ గవర్నర్, జనవరిలో రెండుసార్లు అయోధ్యకు వచ్చానని గుర్తు చేశారు. అప్పుడు కలిగిన భావనే ప్రస్తుతం కలిగిందన్నారు. శ్రీరాముడిని దర్శించుకోవడం సంతోషంగా, గర్వకారణంగా ఉందన్నారు.





