News

వేద విద్యార్థులకు వార్షిక పరీక్షలు

285views

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన స్మార్థ పాఠ శాలలో వేద విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోరంకిలోని స్మార్థ పాఠశాలలో నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను ఆలయ ఈవో కేఎస్ రామరావు ప్రారంభించారు. ప్రశ్నాపత్రాలను పరిశీలించి విద్యార్థులకు అందజేశారు. ఉత్తీర్ణత సాధించిన వారిని పై తరగతులకు పంపిస్తామని, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఆగిరిపల్లి వేద పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసింహమూర్తి పరీక్షల పర్యవేక్షణ అధికా రిగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు షణ్ముఖశాస్త్రి, ఈఈ ఎల్. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.