News

ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 14 నుంచి 16 వరకు వరుణ యాగాలు, జపాలు

27views

లోకకల్యాణార్థం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం దగ్గర త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపించనుంది. దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం 14.08.2026 (శుక్రవారం) నుంచి 16.08.2026 (ఆదివారం) వరకు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనుంది.

దుర్గాఘాట్, పాత యాగశాల వేదికలుగా మూడురోజుల పాటు విశేష హోమాలు, జపాలు, ఘటాభిషేకాలు జరగనున్నాయి. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు మూడు రోజుల పాటు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా వరుణ యాగాలు, వరుణ జపాలు, ఘటాభిషేకాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది.