News

తిరుమల శ్రీవారికి ఏప్రిల్​ లో రికార్డు స్థాయిలో ఆదాయం.

274views

తిరుమల శ్రీవారికి ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. పాత రికార్డును కొననసాగిస్తూ.. ఈసారి కూడా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంది. అయితే మార్చి నెలతో పోలిస్తే.. ఏప్రిల్ నెలలో ఆదాయం తగ్గింది. ఎన్నికల ప్రభావంతో పాటుగా పరీక్షల కారణంగా ఆదాయం తగ్గిందని భావిస్తున్నారు.

తిరుమల శ్రీవారికి మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో భక్తులు కానుకల్ని సమర్పించారు. 2022 మార్చి నెల నుంచి ఈ రికార్డు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారిని 20.17 లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీకి కానుకలు రూ.101.63 కోట్లు రాగా.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.08 లక్షలు. ఏప్రిల్​ లో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 94.22 లక్షలు కాగా.. తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 39.73 లక్షలుగా ఉంది.