భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి ‘బాటలిప్స్ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి. ఈ జాతిజీవులకు సాగర జీవం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర ఉంది. ‘‘ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. ఈ జాతి జీవుల గురించి పరిశోధనకు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. వీటి గురించి శోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న బిజోయ్ నందన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.టార్డిగ్రేడ్లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది. పుడమిపై చోటుచేసుకున్న ఐదు భారీ జీవ అంతర్ధానాలను ఈ జాతి తట్టుకొని నిలబడింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే.
264views
You Might Also Like
మూర్తీభవించిన ఆదర్శం ‘చిలుకూరి”
నిండైన విగ్రహం. అమిత నిగ్రహశాలి. నుదుటన పెద్దబొట్టు. మందస్మిత మోము. స్ఫురద్రూపిత్వం. కళ్లలో తీక్షణతో కూడిన వాత్సల్యం. అచ్చ తెనుగు పంచెకట్టు. భుజాల చుట్టూ ఉత్తరీయం. మాతృభాషలోని...
‘మహర్షి సుశ్రుత సంగ్రహం’ గ్రంథావిష్కరణ
11
ప్రపంచ వైద్య చరిత్రలో శస్త్రచికిత్స పితామహుడిగా ఖ్యాతి పొందిన మహర్షి సుశ్రుత మహోన్నత సేవలను నేటి తరానికి పరిచయం చేసే ఉద్దేశంతో రూపొందించిన 'మహర్షి సుశ్రుత సంగ్రహం'...
జగన్నాథ రథయాత్ర.. భక్తి, సమానత్వం, మోక్షమార్గానికి ప్రతీక
నిఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్తుకు నాథుడైన శ్రీ జగన్నాథ స్వామి ఏడాదిలో ఒకసారి ఆలయాన్ని వీడి భక్తుల మధ్యకు విచ్చేసే అపూర్వ మహోత్సవమే పూరి రథయాత్ర....
ఆషాఢీ వారీ వేళ పండరీపూర్‌లో మాంసం విక్రయాలపై నిషేధం
34
పండరీపూర్: భక్తి పారవశ్యంతో సాగే ఆషాఢీ వారీ సందర్భంగా పండరీపూర్‌లోని శ్రీ విఠోబా రుక్మిణీ దర్శనం కోసం లక్షలాది మంది వార్కరీలు తరలిరానున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని సోలాపూర్...
రామ మందిరంలో చోరీ: రాజకీయ కక్షలు – వాస్తవాలు భాగం-2
రామ మందిరంలో చోరీ: రాజకీయ కక్షలు – వాస్తవాలు భాగం-1 ఇక్కడ చూడవచ్చు (ప్రముఖ విశ్లేషకులు ఎస్. గురుమూర్తి గారి వ్యాసం ఆధారంగా...) దొంగతనం వెనుక అసలు...
బ్రిటన్‌లో హిందూ ఆలయ స్థల విక్రయం వివాదం..
35
లండన్: బ్రిటన్‌లోని పీటర్‌బరో నగరంలో గత నాలుగు దశాబ్దాలుగా హిందువులకు ఆధ్యాత్మిక, సామాజిక కేంద్రంగా కొనసాగుతున్న 'న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్' విక్రయ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది....





