News

ఈ స్కూల్లో ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు..

312views

ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా ప్రైవేట్ స్కూల్ అన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ప్రైవేట్ స్కూల్ పేరుకి చాలా ఫేమస్, అంత పెద్ద పేరున్న స్కూల్లో చదవాలంటే ఎంత ఫీజు చెల్లించాలో అని తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్కూల్లో ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు పిల్లలకు విద్య నేర్పిస్తారు. ఈ స్కూల్ ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. ఫీజుకు బదులు ప్లాస్టిక్‌‌ను సేకరిస్తూ, ఓ వైపు పర్యావరణాన్ని రక్షిస్తూనే మరోవైపు విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోంది. అదే అస్సాంలోని అక్షర్ అనే స్కూల్. వివరాల్లోకి వెళ్తే.. 2016లో పర్మిత శర్మ మజిన్‌ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికులు ఆలోచనలకు ఫలితంగా రూపు రుద్దుకున్నదే ఈ అక్షర్ అనే స్కూల్.

ఈ పాఠశాలలో ఫీజుకు బదులుగా ప్లాస్టిక్‌ను సేకరిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఫీజుకు బదులు ప్లాస్టిక్‌ని తీసుకుంటూ పర్యావరణహితమైన పాఠశాలగా ఈ పాఠశాల ప్రశంసలను అందుకుంటోంది. ఈ పాఠశాలలో చదువు తోపాటుగా పిల్లల్లో మెరుగైన స్కిల్స్, పర్యావరణ స్పృహని పెంపొందిస్తూ ఈ పాఠశాలను నడుపుతున్నారు. ఇక డబ్బులకు బదులుగా వాడి పారేసిన ప్లాస్టిక్‌ని తీసుకుని రమ్మని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సూచిస్తారు.ఎంత ఎక్కువ ప్లాస్టిక్‌ని తీసుకుని వస్తే అంత ఎక్కువగా ఫీజు చెల్లించినట్లుగా రసీదు ఇస్తారు.