News

సీతారాముల కల్యాణోత్సవాలకు మండపేట బోండాలు

323views

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన భక్తులు కొబ్బరిబోండాలు సిద్ధం చేస్తున్నారు. మండపేటకు చెందిన కె.వి.ఎ.రామారెడ్డి 24 ఏళ్లుగా భద్రాచలంలో కల్యాణానికి అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే నవమి వేడుకలకూ బోండాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 17న భద్రాచలం, 22న ఒంటిమిట్ట రామాలయంలº కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.