News

గోవుకు పుట్టిన రోజు వేడుకలు

254views

చిన్నపిల్లల పుట్టిన రోజు వేడుకలు ఎంత ఘనంగా నిర్వహిస్తామో అంతకు ధీటుగానే ఓ గోవుకు మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయినవాళ్లను పిలిచి విందు భోజనాలు పెట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా గొరగనమూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గొరగనమూడి గ్రామానికి చెందిన పంపన రామకృష్ణ ఓ గోవును పెంచుకుంటున్నాడు. ఆ గోవుకు చిన్న ఆవు దూడ ఏడాది క్రితం జన్మించింది. పుట్టిన సమయంలోనే ఆవు దూడకు బెల్లంతో తులాభారం నిర్వహించి భోజనాలు పెట్టారు. ఆ గోవుకు మొదటి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహిం చారు. మూడు రోజుల ముందు నుంచే గ్రామంలో అయినవారందరి ఇంటింటికీ వెళ్లి మా ఆవు దూడకు మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తు న్నామని భోజనాలు కూడా ఏర్పాటు చేశామని కబుర్లు అందించారు. కేక్‌ కట్‌ చేసి దూడకు తినిపించారు. బాణసంచా కాల్చారు. వేడుకకు వచ్చిన సుమారు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా పుట్టిన రోజు వేడుకలు గురించి చెప్పుకున్నారు.