
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి వసంత నవరాత్రోత్సవాలకు ముస్తాబవుతోంది. 9వ తేదీ నుంచి 10రోజుల పాటు నిర్వహించే వసంత నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు అమ్మవారికి రోజుకో విశేషమైన సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో అర్చన నిర్వహిస్తారు. తెలుగు వారి సంవత్సరాది ఉగాది పర్వదినం, వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని ఆలయ ఈవో అధికారులను ఆదేశించారు.
విశేషపుష్పార్చన ఇలా..
9వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రత్యేక పుష్పార్చన ప్రారంభం కానుంది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం విశేష పుష్పార్చన చేస్తారు.




