News

దుర్గగుడిలో అభివృద్ధి పనులపై సమీక్ష

420views

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈవో కేఎస్‌ రామరావు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్‌లో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులు, బడ్జెట్‌, ఆర్జిత సేవలతో పాటు గత వారం రోజుల్లో దేవస్థాన ఆదాయం వంటి అంశాలపై చర్చించారు. భక్తుల వాహనాల పార్కింగ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రసాదాల కౌంటర్లు, టికెట్ల విక్రయ కౌంటర్లతో పాటు పారిశుద్ధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, ఆలయానికి ఆదాయం పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఏప్రిల్‌లో జరిగే ఉత్సవాలు, పూజలు, ఆర్జిత సేవల్లో భక్తుల భాగస్వామ్యం మరింత పెంచడానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఈఈ కోటేశ్వరరావు, ఎల్‌. రమాదేవి, ఏఈవోలు వెంకటరెడ్డి, ఎన్‌.రమేష్‌బాబు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.