News

జమ్మూకశ్మీర్‌లో మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్!

249views

ప్రకృతి అందాలకు పేరు గాంచిన జమ్మూకశ్మీర్ ప్రస్తుతం వడివడిగా ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఫార్ములా – 4 ఈవెంట్ శ్రీనగర్ వేదికగా జరిగింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి టూరిజం శాఖ ఆధ్వర్యంలో దాల్ సరస్సు తీరం వెంబడి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకూ 1.7 కిలోమీటర్ల ట్రాక్‌పై ఈ ఈవెంట్ నిర్వహించారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సాగిన కార్యక్రమంలో పలువురు ప్రొఫెషనల్ ఫార్ములా – 4 డ్రైవర్లు పాల్గొన్నారు. దూసుకుపోతున్న కార్లను వీక్షించేందుకు యువత పోటీపడ్డారు. డ్రైవర్లు కార్లతో చేసిన వివిధ రకాల స్టంట్లు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం ఫార్ములా – 4 డ్రైవర్లు యువతతో మాట్లాడారు. కార్లు, రేసింగ్‌కు సంబంధించి అనేక అంశాలు వారితో చర్చించి యువతలో కార్ల రేసింగ్‌‌పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు.