Newsvideos

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

317views

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు అఖిల ఆంధ్రుల హృదయాలలో అమర జీవిగా నిలచిపోయారు. ఆ విధంగా ఆ అమర జ్యోతి ఆగిపోయినా వారందించిన పోరాట స్ఫూర్తితో తెలుగు జాతి యావత్ ప్రపంచానికి వెలుగులు పంచుతూ ముందుకు సాగుతోంది.